ఎరువుల కొరత రానీయొద్దు: కలెక్టర్ నారాయణరెడ్డి
దిశ, నిజామాబాద్: వర్షాకాలం పంటల కోసం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను కలెక్టర్ సీ నారాయణరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో శుక్రవారం జిల్లాలో విత్తనాలు, ఎరువుల నిలువలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వర్షా కాలానికి ఎరువులు విత్తనాలు ఏ మేరకు అవసరం అవుతాయో గుర్తించి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎరువులు దింపుకోడానికి గోదాంల కొరత లేకుండా చూడాలని, సొసైటీలో నిలువలు గుర్తించి అవసరం మేరకు […]
దిశ, నిజామాబాద్: వర్షాకాలం పంటల కోసం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను కలెక్టర్ సీ నారాయణరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో శుక్రవారం జిల్లాలో విత్తనాలు, ఎరువుల నిలువలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వర్షా కాలానికి ఎరువులు విత్తనాలు ఏ మేరకు అవసరం అవుతాయో గుర్తించి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎరువులు దింపుకోడానికి గోదాంల కొరత లేకుండా చూడాలని, సొసైటీలో నిలువలు గుర్తించి అవసరం మేరకు ముందస్తుగా సమకూర్చుకోవాలని సూచించారు. సొసైటీలకు వారంలోపు బఫర్ నిల్వల నుంచి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సొసైటీల్లో అకౌంట్స్ సరిగ్గా మెయింటైన్ చేసేలా సీఈవో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బీ చంద్రశేఖర్, జేడీఏ గోవిందు, డీసీఎస్ఓ సింహాచలం, మార్క్‌ఫెడ్ అధికారులు, ఏడీఏ తదితరులు పాల్గొన్నారు.
Tags: Nalgonda, collector Narayana Reddy, Review, Monsoon, Fertilizer