కరోనా అలర్ట్..రెడ్ జోన్లలో కలెక్టర్ పర్యటన
దిశ, మెదక్: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వ ఆదేశాలమేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరానగర్, కొత్త బస్‌స్టాండ్ , పాత బస్‌స్టాండ్‌లను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. మంగళవారం ఆ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు పర్యటించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలెవరూ ఇళ్లలో నుంచి […]
దిశ, మెదక్: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వ ఆదేశాలమేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరానగర్, కొత్త బస్‌స్టాండ్ , పాత బస్‌స్టాండ్‌లను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. మంగళవారం ఆ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు పర్యటించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని, నిత్యావసర సరుకుల కోసం అవసరమైతే అదనపు వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజల అవసరాల మేరకు సరఫరా చేస్తామని వెల్లడించారు. వైరస్ నివారణకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లను వాడాలని సూచించారు.
Tags: corona, lockdown,redzone, collector m.hanumantha rao