కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇస్తుంది అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి.. కలెక్టర్
దిశ ప్రతినిధి , హైదరాబాద్: పునరుద్ధరణీయ ఇంధన వనరులను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ సూచించారు. కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం నుండి ఈ నెల 20వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర పురుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఇంధన పొదుపు వారోత్సవాల గోడ పత్రికను కలెక్టర్ విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచించారు. సోలార్ నెట్ మీటర్ ఇంటి పై నిర్మించుకోవడానికి కేంద్ర […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్: పునరుద్ధరణీయ ఇంధన వనరులను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ సూచించారు. కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం నుండి ఈ నెల 20వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర పురుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఇంధన పొదుపు వారోత్సవాల గోడ పత్రికను కలెక్టర్ విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచించారు. సోలార్ నెట్ మీటర్ ఇంటి పై నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి.వేణు గోపాల్, తదితరులు పాల్గొన్నారు.