ఎన్నికల సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం

దిశ, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ భారతి హోళికేరి సందర్శించారు. ఈ మేరకు ఓటరు టర్న్ ఔట్ టీమ్ తో చర్చించి ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం నివేదికలు పంపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించడంతో పాటు, గ్లౌజులు ఉపయోగించేలా […]

Update: 2020-11-03 00:56 GMT

దిశ, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ భారతి హోళికేరి సందర్శించారు. ఈ మేరకు ఓటరు టర్న్ ఔట్ టీమ్ తో చర్చించి ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం నివేదికలు పంపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించడంతో పాటు, గ్లౌజులు ఉపయోగించేలా చూడాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సేవలు కూడా కల్పించాలన్నారు. కాగా కొందరు సిబ్బంది ఫోన్లతో రావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News