ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు
దిశ,సిద్ధిపేట: ర్యాండమైజేషన్ ద్వారా దుబ్బాక ఉప ఎన్నికలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీమతి భారతి హోళికేరి తెలిపారు. సిద్ధిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం సంగారెడ్డి ఏన్ఐసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యామలా ఇక్బాల్ తో కలిసి తుది ర్యాండమైజేషన్ కేటాయింపులో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 3న దుబ్బాకలో జరిగే ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఒక్కో […]
దిశ,సిద్ధిపేట:
ర్యాండమైజేషన్ ద్వారా దుబ్బాక ఉప ఎన్నికలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీమతి భారతి హోళికేరి తెలిపారు. సిద్ధిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం సంగారెడ్డి ఏన్ఐసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యామలా ఇక్బాల్ తో కలిసి తుది ర్యాండమైజేషన్ కేటాయింపులో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 3న దుబ్బాకలో జరిగే ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్‌కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు ఇతర పోలింగ్ అధికారుల చొప్పున కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.