బాంబుల షాప్ యజమానుల వద్ద పర్మిషన్ పేరిట వసూళ్లు?
దిశ, కోదాడ : పెరుగుతున్న కాలుష్య తీవ్రత దృష్ట్యా, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వాలు బాంబుల విక్రయాలను షాపుల ముందు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వని సంగతి అందరికీ తెలిసిందే. పట్టణానికి దూరంలో జన సంచారం లేని ప్రాంతాలలో బాంబులు విక్రయించాలని ఆదేశాలు ఉండటంతో సదరు షాపుల యజమానులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దూర ప్రాంతాలలో మునిసిపాలిటీ వారు సూచించిన స్థలం వద్ద విక్రయిస్తూ ఉన్నారు. వారు అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోతున్నప్పటికీ, అధికారుల బెదిరింపులు మాత్రం […]
దిశ, కోదాడ : పెరుగుతున్న కాలుష్య తీవ్రత దృష్ట్యా, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వాలు బాంబుల విక్రయాలను షాపుల ముందు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వని సంగతి అందరికీ తెలిసిందే. పట్టణానికి దూరంలో జన సంచారం లేని ప్రాంతాలలో బాంబులు విక్రయించాలని ఆదేశాలు ఉండటంతో సదరు షాపుల యజమానులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దూర ప్రాంతాలలో మునిసిపాలిటీ వారు సూచించిన స్థలం వద్ద విక్రయిస్తూ ఉన్నారు. వారు అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోతున్నప్పటికీ, అధికారుల బెదిరింపులు మాత్రం తగ్గడం లేదని వాపోతున్నారు.
కోదాడ పట్టణంలో ప్రతి సంవత్సరం పట్టణంలోని ఎన్. ఆర్.ఎన్ గ్రౌండ్‌లో ఈసారి కూడా బాంబులను విక్రయించడానికి షాప్ యజమానులు సిద్ధమవుతున్న తరుణంలో, అనుమతులు ఇచ్చేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదని షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు నాయకులకు కొంచెం నగదు ఇవ్వాలని చెప్పుకుంటూ, సంఘ నాయకులు సుమారు ఒక్కొక్క షాపు వద్ద నుండి 30 వేల రూపాయల నగదు వసూలు చేశారని సమాచారం. మొత్తం తొమ్మిది లక్షల 90 వేల రూపాయల వరకు వసూలు చేసి అధికారులకు, నాయకులకు ఇవ్వాలని, ఒక వేళ ఇవ్వలేనిపక్షంలో పర్మిషన్ ఇవ్వాలేమంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఆ సంఘం నాయకులు చెప్పిన విధంగా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని షాప్ యజమానులు వాపోతున్నారు.