త్వరలో ఆదాయం 15 శాతం పెరగొచ్చు !
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెలికాం పరిశ్రమ ఆదాయం 14 నుంచి 15 శాతం పెరిగే అవకాశాలున్నాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ-కాయ్) అంచనా వేసింది. వినియోగదారుల నుంచి సగటు ఆదాయం కొంత పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమకు ఆదాయం పెరుగుతుందని కాయ్ తెలిపింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో చందాదారుల సంఖ్య ఫ్లాట్‌గా ఉండొచ్చని కొత్తగా నియమితులైన కాయ్ డైరెక్టర్ జనరల్ ఎస్.పీ కొచ్చర్ చెప్పారు. చందాదారులకు అవసరమైన ధరల్లో నాణ్యమైన సేవలను అందించేందుకు ప్రస్తుతం […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెలికాం పరిశ్రమ ఆదాయం 14 నుంచి 15 శాతం పెరిగే అవకాశాలున్నాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ-కాయ్) అంచనా వేసింది. వినియోగదారుల నుంచి సగటు ఆదాయం కొంత పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమకు ఆదాయం పెరుగుతుందని కాయ్ తెలిపింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో చందాదారుల సంఖ్య ఫ్లాట్‌గా ఉండొచ్చని కొత్తగా నియమితులైన కాయ్ డైరెక్టర్ జనరల్ ఎస్.పీ కొచ్చర్ చెప్పారు.
చందాదారులకు అవసరమైన ధరల్లో నాణ్యమైన సేవలను అందించేందుకు ప్రస్తుతం టెలికాం రంగంలో ఉన్న మూడు కంపెనీలు మాత్రమే ఉంటే ఉపయోగం ఉండదు. రాబోయే కాలంలో ఇది మంచిది కాదు. పరిశ్రమలో పోటీ ఉండాలి. పరిశ్రమలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు స్పష్టంగా తెలుస్తున్నాయని, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్ ఫీజుతో సహా, లైసెన్స్ ఫీజు,స్పెక్ట్రం వినియోగ ఛార్జీలపై జీఎస్టీ మినహాయింపు, వేలంలో పొందిన స్పెక్ట్రం చెల్లింపుల్లో ఉపశమనం కోసం కాయ్ ప్రయత్నిస్తోందని కొచ్చర్ వివరించారు. టెలికాం పరిశ్రమలో రెండు కంపెనీలు మిగిలి, పోటీ తగ్గిపోతుందా అన్న ప్రశ్నకు బదులిచ్చిన కొచ్చర్.. ఈ పరిశ్రమలో పోటీ లేకపోతే వినియోగదారులకు ప్రయోజనాలు ఉండవు. ఆ పరిస్థితులు రావనే భావిస్తున్నాం. ప్రస్తుతం పరిశ్రమలో పోటీ ఉంది. కాబట్టి సరసమైన ధరల్లో మెరుగైన సేవలను కస్టమర్లకు అందిస్తున్నాయని తెలిపారు.