అందుకే ట్రాన్స్‌ఫార్మర్లలో సప్లయ్ నిలిపివేత !

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగర పరిధిలో అపార్ట్మెంట్ సెల్లార్లు, వీధుల్లో ముంపు కారణంగా 139ట్రాన్స్ ఫార్మర్లలో సప్లయ్ నిలిపివేశామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. నీట మునిగిన కాలనీల్లో జరుగుతున్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అత్యధికంగా ప్రభావితమైన హైదరాబాద్ సౌత్, సెంట్రల్ సర్కిళ్ల పరిధిలోని వివిధ కాలనీల్లో పర్యటించి మాట్లాడుతూ హఫీజ్‌ బాబానగర్‌లో 42విద్యుత్ స్తంభాలు, 20పంపిణి ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. నదీమ్ కాలనీలోనూ […]

Update: 2020-10-19 10:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగర పరిధిలో అపార్ట్మెంట్ సెల్లార్లు, వీధుల్లో ముంపు కారణంగా 139ట్రాన్స్ ఫార్మర్లలో సప్లయ్ నిలిపివేశామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. నీట మునిగిన కాలనీల్లో జరుగుతున్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అత్యధికంగా ప్రభావితమైన హైదరాబాద్ సౌత్, సెంట్రల్ సర్కిళ్ల పరిధిలోని వివిధ కాలనీల్లో పర్యటించి మాట్లాడుతూ హఫీజ్‌ బాబానగర్‌లో 42విద్యుత్ స్తంభాలు, 20పంపిణి ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. నదీమ్ కాలనీలోనూ 22విద్యుత్ స్తంభాలు 7పంపిణి ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు. రాగల రెండురోజుల్లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నగరంలో 189సెక్షన్ స్థాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు 24గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Tags:    

Similar News