పోలవరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం వైఎస్ జగన్
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా అధికారులతో కలిసి సీఎం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సీఎం జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, అధికారులు ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం పోలవరం […]
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా అధికారులతో కలిసి సీఎం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సీఎం జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, అధికారులు ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి ఫోటో గ్యాలరీని వీక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2022నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.