ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి ఎయిర్ పోర్ట్.. ప్రారంభించిన సీఎం జగన్
దిశ,వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో రన్‌వే, నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడతూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇదే ఎయిర్ పోర్ట్ […]
దిశ,వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో రన్‌వే, నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడతూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇదే ఎయిర్ పోర్ట్ కు ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి నిర్మాణాలు పూర్తి కాకుండా ఓట్లలో లబ్ధి పొందేందుకు రిబ్బన్ కటింగ్ చేశారని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అన్నీ అనుమతులతో ఎయిర్ పోర్ట్ నిర్మాణాల్ని పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ఎయిర్ పోర్ట్ తో కలిపి రాష్ట్రంలో మొత్తం 6 ఎయిర్ పోర్ట్ లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
మనదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. భారత కాంగ్రెస్ 1885లోనే పుట్టింది. 1915లో గాంధీ మనదేశానికి తిరిగి వచ్చారు. 1917లో తొలిసారి ఉప్పు సత్యాగ్రహం బీహార్ లో జరిగింది. అయితే వీటన్నింటి కంటే ముందు ఈ గడ్డమీద, ఈ కర్నూల్ గడ్డ మీద స్వాతంత్ర్యానికి 100 సంవత్సరాల ముందే మొదటి స్వాతంత్రం పేరుతో మొదటి చరిత్రకారులు చెప్పినట్లుగా.., 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటుకన్నా ముందే 1847లో రైతుల పక్షాన పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన మహా స్వాతంత్రం యోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి ఈ గడ్డనుంచే వచ్చారు. ఈరోజు ఆయనకు నివాళిగా ఈ ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అని పేరు పెడుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.
– ఓర్వకల్లులో సీఎం జగన్ ప్రసంగం