బిగ్‌బ్రేకింగ్ : త్వరలో సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా..?

దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ప్రధానితో సమావేశమైన ఆయన ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొత్త ముఖ్యమంత్రి ఎంపికలోనూ సహకరిస్తారని అధిష్టానానికి ఆయన ప్రామిస్ చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నిర్ణయం కర్ణాటకలో రాజకీయాల్లో పెను సంచలనం రేపనుంది. ముఖ్యమంత్రి స్పందన.. రాజీనామా విషయంపై […]

Update: 2021-07-17 00:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ప్రధానితో సమావేశమైన ఆయన ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొత్త ముఖ్యమంత్రి ఎంపికలోనూ సహకరిస్తారని అధిష్టానానికి ఆయన ప్రామిస్ చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నిర్ణయం కర్ణాటకలో రాజకీయాల్లో పెను సంచలనం రేపనుంది.

ముఖ్యమంత్రి స్పందన..

రాజీనామా విషయంపై ఆలస్యంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. టీవీ చానెళ్లలో ప్రసారమవుతున్న వార్తలను ఆయన ఖండించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయడం లేదని స్పష్టంచేశారు. అవన్నీ ఊహగానాలేనని కొట్టిపారేశారు.

Tags:    

Similar News