ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం
దిశ, తెలంగాణ బ్యూరో : పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో గంగా, జమునా తహజీబ్‌కు రంజాన్ పర్వదినం ఓ ప్రతీక అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతూ గుణాత్మక ఫలితాలను ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రంజాన్‌ను ఇండ్లలోనే […]
దిశ, తెలంగాణ బ్యూరో : పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో గంగా, జమునా తహజీబ్‌కు రంజాన్ పర్వదినం ఓ ప్రతీక అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతూ గుణాత్మక ఫలితాలను ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
రంజాన్‌ను ఇండ్లలోనే జరుపుకోవాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి
ముస్లింలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంజాన్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించిందని తెలిపారు. లాక్ డౌన్ కొనసాగుతున్నందున రంజాన్ పండుగను ఎవరి ఇంట్లో వారే కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని సూచించారు.
ఈద్ ముబారక్ : మంత్రి హరీష్ రావు
రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లింలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సేవాదృక్పథ భక్తి ప్రవృతులు, సోదరభావాలు మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను ముస్లింలంతా సంతోషం గా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదే విధంగా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.