సీఎం సర్.. మున్నూరు కాపులను మోసం చేయకండి : పటేల్
దిశ, తెలంగాణ బ్యూరో : రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో మున్నూరు కాపులకు స్థానం కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ పుటం పురుషోత్తమ రావు పటేల్ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మున్నూరు కాపు అభ్యర్థులకు అవకాశం రాలేదని, నిరాశే ఎదురైందని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మున్నూరు కాపులు కీలక భూమిక పోషించారని, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ వెంట నడిచారని గుర్తుచేశారు. ఇప్పటికే నలుగురు మున్నూరుకాపు ఎమ్మెల్సీల […]
దిశ, తెలంగాణ బ్యూరో : రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో మున్నూరు కాపులకు స్థానం కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ పుటం పురుషోత్తమ రావు పటేల్ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మున్నూరు కాపు అభ్యర్థులకు అవకాశం రాలేదని, నిరాశే ఎదురైందని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మున్నూరు కాపులు కీలక భూమిక పోషించారని, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ వెంట నడిచారని గుర్తుచేశారు. ఇప్పటికే నలుగురు మున్నూరుకాపు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తయిందని, త్వరలో మరో ఎమ్మెల్సీ కూడా ముగుస్తున్నా అవకాశం రాకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి అండగా ఉంటూ అహర్నిశలు కృషి చేస్తున్నా మున్నూరు కాపులను మోసం చేయడం సమంజసం కాదన్నారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం పటేల్ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల నుండి ఎన్నికైన శంభీపూర్ రాజు త్వరలో పదవీ విరమణ చేయనున్నారని, ఆయనకు రెన్యూవల్ చేయడంతో పాటు మరో ముగ్గురు మున్నూరుకాపులకు అవకాశం కల్పించాలని కోరారు. శాసన మండలి నుంచి ఈ మధ్యనే డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, సభ్యులు ఆకుల లలిత, సంతోష్‌రావు, పూల రవీందర్ రావు మండలికి ప్రాతినిధ్యం వహించి రిటైర్ అయ్యారని, వారి స్థానంలో మున్నూరు కాపులకు అవకాశం కల్పిస్తారని ఆశించామన్నారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తూ రాష్ట్ర జనాభాలో 18% శాతం ఉన్న కులమని పేర్కొన్నారు.