ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు : సీఎం పళనిస్వామి
దిశ, వెబ్‌డెస్క్ : తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ అంశం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై తమిళనాడు సీఎం పళని స్వామి స్పందించారు. ‘ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందన్నారు. విజయ్ పార్టీ పెడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పారు.’ఇదిలా ఉండగా, తన రాజకీయ ఎంట్రీపై ఇళయతలపతి విజయ్ గురువారం రాత్రే […]
దిశ, వెబ్‌డెస్క్ : తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ అంశం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై తమిళనాడు సీఎం పళని స్వామి స్పందించారు. ‘ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందన్నారు. విజయ్ పార్టీ పెడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పారు.’ఇదిలా ఉండగా, తన రాజకీయ ఎంట్రీపై ఇళయతలపతి విజయ్ గురువారం రాత్రే క్లారిటీ ఇచ్చారు.
తాను ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదని, తన తండ్రి స్థాపించిన పార్టీతోనూ ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయాల కోసం తన పేరు, ఫోటోలను వాడుకుంటే బాగోదని చాలా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. అయితే, హీరో విజయ్ రాజకీయ పార్టీ పెట్టినట్టు, ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేయించినట్టు అభిమానులు పుకార్లు పుట్టించినట్లు తేలింది.