సీఎం లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వసూళ్లకు పాల్పడుతున్న టీఆర్ఎస్ కార్యకర్తను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ కు చెందిన చింటూ అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ అయిన కేసులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ తో దిగిన ఫొటోలు చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులకు మాయమాటలు చెప్పి వసూళ్లకు పాల్పడుతుండగా అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు […]

Update: 2020-08-22 02:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వసూళ్లకు పాల్పడుతున్న టీఆర్ఎస్ కార్యకర్తను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ కు చెందిన చింటూ అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ అయిన కేసులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ తో దిగిన ఫొటోలు చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులకు మాయమాటలు చెప్పి వసూళ్లకు పాల్పడుతుండగా అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఇది వరకే నకిలీ ఉత్తర్వులేమైనా తయారు చేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News