మంత్రులకు సీఎం కేసీఆర్ వార్నింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ సీఎం అవుతారని, ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నాయి.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. తాను సీఎంగా ఉండగానే ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అని ప్రశ్నించారు. మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ స్పీకర్ తదితరులను విడిగా రూమ్‌లోకి పిలిపించుకుని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రెండున్నర గంటల పాటు మాట్లాడిన అనంతరం కొద్దిమందిని విడిగా పిలిపించుకుని, సీఎంగా […]
దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ సీఎం అవుతారని, ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నాయి.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. తాను సీఎంగా ఉండగానే ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అని ప్రశ్నించారు. మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ స్పీకర్ తదితరులను విడిగా రూమ్‌లోకి పిలిపించుకుని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రెండున్నర గంటల పాటు మాట్లాడిన అనంతరం కొద్దిమందిని విడిగా పిలిపించుకుని, సీఎంగా ఉన్న తనతోని రాజీనామా చేయించాలనుకుంటున్నారా అని నిలదీశారు. కాబినెట్ మంత్రులుగా ఉండి కూడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడాన్ని కేసీఆర్ సీరియస్‌గానే తీసుకున్నారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్లు చేస్తే గట్టిగానే వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది.
కేటీఆర్ సీఎం కావాలంటూ బహిరంగంగా కామెంట్లు చేసినవారందరినీ తీవ్రంగా మందలించి పార్టీ క్రమశిక్షణ తప్పితే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. కార్యవర్గ సమావేశం అనంతరం జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్లు లాంటి నేతలందరితో కూడి విడిగా సమావేశమై సభ్యత్వ నమోదు ప్రక్రియ, భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడం లాంటి పలు అంశాలను చర్చించారు. స్థానిక ఎమ్మెల్యేల పెత్తనం, ప్రజలతో సంబంధాలు లాంటి అంశాలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం.