యాద్రాద్రిలో ఏప్రిల్ 15లోగా క్యూలైన్ల నిర్మాణం పూర్తి : కేసీఆర్

దిశ, వెబ్ డెస్క్: ఈరోజు సీఎం కేసీఆర్ యాద్రాద్రి పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా యాద్రాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాద్రాద్రి ప్రారంభోత్సవానికి ముందే తుదిమెరుగులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరతిగతిన పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కేసీఆర్ మాట్లాడుతూ.. ఆలయంలో భక్తుల కోసం ఏప్రిల్ 15లోగా క్యూలైన్ల నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. ఉత్తరాన ప్రహారీ గోడ తొలగించి క్యూలైన్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. 350 అడుగుల పొడవునా క్యూలైన్ల […]

Update: 2021-03-12 06:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈరోజు సీఎం కేసీఆర్ యాద్రాద్రి పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా యాద్రాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాద్రాద్రి ప్రారంభోత్సవానికి ముందే తుదిమెరుగులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరతిగతిన పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కేసీఆర్ మాట్లాడుతూ.. ఆలయంలో భక్తుల కోసం ఏప్రిల్ 15లోగా క్యూలైన్ల నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. ఉత్తరాన ప్రహారీ గోడ తొలగించి క్యూలైన్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. 350 అడుగుల పొడవునా క్యూలైన్ల నిర్మాణం జరగాలని అన్నారు. భక్తులు యాద్రాద్రి ఆలయం చుట్టూ తిరిగేలా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆలయంలో 80అడుగుల పొడువు ఉన్న దీపస్తంభం ఏర్పాటు, ఇత్తడి డిజైన్లతో.. క్యూలైన్లకు బిగించే కలశపు నమూనాలను కేసీఆర్ పరిశీలించారు. విష్ణు పుష్కరిణికి రెండు వైపులా వెలుగులు వెదజిల్లేలా దీపస్తంభం ఉండాలని తెలిపారు. నూటినూరు శాతం రాతి కట్టడాలతో యాద్రాద్రి ఆలయ పునర్మిర్మాణం జరుగుతుందని అన్నారు.

 

 

Tags:    

Similar News