వాసాలమర్రిలో కేసీఆర్.. వీధుల్లో తిరుగుతూ పలకరింపు.. ఫోటోలు
దిశ, భువనగిరి రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాసాలమర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత దళిత వాడలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దళిత వాడలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దళితుల స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్నారు. దళితవాడలో పర్యటన ముగిసిన అనంతరం.. గ్రామమంతా కలియ తిరుగుతూ పారిశుద్ధ్య చర్యలను పరిశీలించనున్నారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన […]
దిశ, భువనగిరి రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాసాలమర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత దళిత వాడలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దళిత వాడలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దళితుల స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్నారు.
దళితవాడలో పర్యటన ముగిసిన అనంతరం.. గ్రామమంతా కలియ తిరుగుతూ పారిశుద్ధ్య చర్యలను పరిశీలించనున్నారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామాభివృద్ధిపై గ్రామస్తులతో చర్చించనున్నారు. గత పర్యటన సందర్భంగా తాను చేసిన పలు సూచనల అమలుతీరుపై ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నారు.
తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు దిశానిర్దేశం చేస్తారు. వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ రావడం ఇది రెండోసారి. జూన్ 22న తొలిసారిగా వాసాలమర్రికి వచ్చిన ముఖ్యమంత్రి.. గ్రామస్తులతో కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించి అనంతరం సహపంక్తి భోజనం చేశారు. 42 రోజుల తర్వాత సీఎం మరోసారి గ్రామానికి వచ్చారు.