అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోండి !

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇవాళ కూడా చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని.. సోమ, మంగళవారాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంచాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు […]

Update: 2020-10-11 05:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇవాళ కూడా చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని.. సోమ, మంగళవారాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంచాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వరదలు కూడా భారీగానే వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

Tags:    

Similar News