లాక్‌డౌన్ పొడిగింపుపై పునరాలోచించండి: ఎంపీ అర్వింద్
దిశ, నిజామాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపుపై పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్‌డౌన్, విధించిందని, ఈ గడువు ముగిసిన తర్వాత అన్ని రాష్ట్రాలు రిలీఫ్‌ను ఇవ్వబోతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగించడం సబబు కాదన్నారు. సోమవారం నగరంలో సీపీ కార్తికేయను ఎంపీ అర్వింద్ కలిశారు. కూరగాయల బండ్లపై కాషాయ జెండాలను తొలగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. […]
దిశ, నిజామాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపుపై పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్‌డౌన్, విధించిందని, ఈ గడువు ముగిసిన తర్వాత అన్ని రాష్ట్రాలు రిలీఫ్‌ను ఇవ్వబోతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగించడం సబబు కాదన్నారు. సోమవారం నగరంలో సీపీ కార్తికేయను ఎంపీ అర్వింద్ కలిశారు. కూరగాయల బండ్లపై కాషాయ జెండాలను తొలగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు నగరంలో ఏర్పాటు చేసిన పండ్లు, కూరగాయల దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం రూ. లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, లాక్‌డౌన్ పొడిగింపు కారణంగా ఆర్థికంగా ఇంకా చితికిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని లాక్‌డౌన్ పొడిగింపుపై పునరాలోచన చేయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా హైదరాబాద్‌లోని పాతబస్తీలో నమోదవుతున్నాయన్నారు. విపత్కర సమయంలో నిజామాబాద్ రైస్ మిల్లర్లు పేదల సహాయార్థం అందజేసిన 247 క్వింటాళ్ల బియ్యం పంపిణీ విషయం లో కూడా టీఆర్‌ఎస్ నేతలు రాజకీయాలు చేయడం తగదన్నారు. కరోనాను కట్టడి చేయడంలో అధికారులు, పోలీసుల పనితీరు అభినందనీయమని చెప్పారు.
tags ;corona, lockdown, cm kcr rethink on lockdown decision, mp arvind