‘నేను ఉన్నంతవరకు ఆర్టీసీని బతికిస్తా’

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుందని, ఆర్టీసీ సంస్థను కూడా బతికించుకుని తిరిగి గాడిన పెట్టేదాక నిద్రపోనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాను ఉన్నంతకాలం ఆర్టీసీని బతికించుకుంటానని, సంస్థ లాభనష్టాల గురించి ఆలోచించకుండా అత్యంత చౌక ప్రజా రవాణా వ్యవస్థగా పేదలకు ఉపయోగపడే ఆర్టీసీని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ఆర్టీసీ సిబ్బందికి రెండు నెలల వేతనలో కోతపెట్టిన మొత్తాన్ని వెంటనే చెల్లిస్తామని ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన […]

Update: 2020-11-15 06:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుందని, ఆర్టీసీ సంస్థను కూడా బతికించుకుని తిరిగి గాడిన పెట్టేదాక నిద్రపోనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాను ఉన్నంతకాలం ఆర్టీసీని బతికించుకుంటానని, సంస్థ లాభనష్టాల గురించి ఆలోచించకుండా అత్యంత చౌక ప్రజా రవాణా వ్యవస్థగా పేదలకు ఉపయోగపడే ఆర్టీసీని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ఆర్టీసీ సిబ్బందికి రెండు నెలల వేతనలో కోతపెట్టిన మొత్తాన్ని వెంటనే చెల్లిస్తామని ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన రూ. 120 కోట్లను తక్షణం విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రగతి భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం చర్చించిన అంశాలను ప్రభుత్వం ప్రకటన రూపంలో పత్రికలకు విడుదల చేసింది.

కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా వెనకబడిన ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. కరోనా భయంతో వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగిపోయిందని, ఈ కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోయిందని, ఫలితంగా ఆర్టీసీ మళ్ళీ నష్టాల్లోకి పోయిందని, ఈ కష్టాలను దాటుకుంటూ లాంటి నిర్ణయాలు తీసుకుంటే తిరిగి కోలుకుంటుందో, కరోనా మునుపతి పరిస్థితులకువస్తుందో అధికారులు విశ్లేషించుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలని వారిని సిఎం ఆదేశించారు. కరోనా కారణంగా ఇప్పటివరకూ కేవలం 20 శాతం బస్సు సర్వీసులను మాత్రమే నగరంలో నడుపుతూ ఉండగా దీన్ని ఇకపైన 50 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించే విధివిధానాలపైనా చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడినపడుతూ లాభాల బాటలోకి వస్తున్న ఆర్టీసీకి కరోనా పరిస్థితులు కష్టాలను తెచ్చిపెట్టాయని, అయినా వెనకడుగువేయకుండా ఆ సంస్థను బతికించుకుంటామని స్పష్టంచేశారు. ఆర్టీసీకి అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన కార్గో సేవలకు ప్రజల నుంచి ఆదరణ లభించిందని, సమీప భవిష్యత్తులో రైల్వే తరహాలోనే కార్గో సేవలతో లాభాలను గడిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సేవలను ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే మిలియన్ (పది లక్షల) పార్సిళ్ళను రవాణా చేసి రికార్డు సృష్టించిందన్నారు. హైదరాబాద్ నగరంలో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా జిల్లాల నుంచి వచ్చిపోయే ప్రయాణీకులకు రవాణా భరోసా దొరుకుతుందని, అందుకోసం బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని సిఎం సూచించారు.

 

Tags:    

Similar News