గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని మర్యాదపూర్వకంగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. ప్రతీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నతర్వాత బడ్జెట్ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం కూడా ఇదే తొలిసారి. ఈ సమావేశాల్లో గవర్నర్ చేయనున్న ప్రసంగంతో పాటు రానున్న ఆర్థిక సంవత్సరానికి […]
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని మర్యాదపూర్వకంగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. ప్రతీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నతర్వాత బడ్జెట్ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం కూడా ఇదే తొలిసారి. ఈ సమావేశాల్లో గవర్నర్ చేయనున్న ప్రసంగంతో పాటు రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్, కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు వివరించారు. మంత్రిమండలి ఆమోదించిన ప్రసంగం ప్రతిని కూడా గవర్నర్‌కు అందించినట్లు తెలిసింది. బడ్జెట్‌కు మంత్రిమండలి ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది. సమావేశాల ప్రారంభం రోజునే బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి కూడా ఉన్నారు.
బడ్జెట్ అంశాలతో పాటు దేశం మొత్తం అలజడి రేపుతున్న కరోనా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. కొత్తగా తీసుకురానున్న రెవిన్యూ చట్టం గురించి కూడా ఆమెకు వివరించి ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల ఉనికిలోకి వచ్చిన సిఏఏ చట్టం, వివాదాస్పదంగా మారిన ఎన్నార్సీ విషయంలో కూడా వీరిరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
tags : Telangana, Budget, Governor, CM KCR, Corona, Raj Bhavan, Assembly