నేడు నగరంలో ఇటువైపు వెళ్లకండి

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: గ్రేటర్ ఎన్నికల నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ శనివారం ఎల్బీస్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. దీంతో నగరంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. నగర ప్ర‌జ‌లు ఆంక్షలున్న ప్రాంతాల్లోకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్ర‌యాణించాల‌ని ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆంక్ష‌లు ఇవే… పోలీస్ కంట్రోల్ రూం నుంచి […]

Update: 2020-11-27 08:19 GMT

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: గ్రేటర్ ఎన్నికల నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ శనివారం ఎల్బీస్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. దీంతో నగరంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. నగర ప్ర‌జ‌లు ఆంక్షలున్న ప్రాంతాల్లోకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్ర‌యాణించాల‌ని ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.

ఆంక్ష‌లు ఇవే…

పోలీస్ కంట్రోల్ రూం నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం చౌరస్తా వైపు అనుమతించబోరు. వీరు ఏఆర్ పెట్రోలు బంక్, చాపెల్ రోడ్డు వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది. అబిడ్స్, గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఎస్‌బీఐ (గన్‌ఫౌండ్రీ) నుంచి చాపెల్ రోడ్డువైపు మళ్లించనున్నారు. బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి అబిడ్స్ జీపీవో వైపు వచ్చే వారిని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ ‌కోటి రోడ్డువైపు మళ్లిస్తారు. అలాగే, హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు. దీనికి నగర ప్రజలు సహకరించాలని కోరారు.

Tags:    

Similar News