నిలకడగా సీఎం కేసీఆర్ ఆరోగ్యం

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా పాజిటివ్ బారిన పడిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్‌లో ఐసొలేషన్‌లో ఉన్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వైద్యుల, నర్సుల బృందం అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఆయనకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేస్తూ బీపీ, షుగర్, పల్స్, జ్వరం తదితరాలను పరిశీలిస్తూ ఉన్నారు. యశోద ఆసుపత్రి వైద్యులతో పాటు కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు ఎప్పటికప్పుడు […]

Update: 2021-04-20 09:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా పాజిటివ్ బారిన పడిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్‌లో ఐసొలేషన్‌లో ఉన్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వైద్యుల, నర్సుల బృందం అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఆయనకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేస్తూ బీపీ, షుగర్, పల్స్, జ్వరం తదితరాలను పరిశీలిస్తూ ఉన్నారు. యశోద ఆసుపత్రి వైద్యులతో పాటు కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సూచనలు ఇస్తూ ఉన్నారు.

పాజిటివ్ సోకిన కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడాలని, త్వరగా కోలుకోవాలని మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్ని ఆలయాల్లో కేసీఆర్ త్వరగా కోలుకునేలా పూజారులు ప్రత్యేక పూజలు చేయాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోన్‌లోనే కేసీఆర్‌ను పరామర్శించారు. నైట్ కర్ఫ్యూ నిర్ణయం గురించి ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. రాష్ట్రవ్యాప్తంగా అమలు గురించి కూడా వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా పరిస్థితుల గురించి, వైరస్ వ్యాప్తి కట్టడికి అవలంబిస్తున్న చర్యలపై వివరించారు

Tags:    

Similar News