సీఎం కేసీఆర్‌కు బుద్ధిలేదు.. మంత్రులకు జ్ఞానం లేదు..
దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాలను తరలించుకుపోవాలని చెప్పిందే సీఎం కేసీఆర్అని, అసెంబ్లీ వేదికగా రాయలసీమకు నీళ్లు తీసుకుపోవాలని చెప్పాడని, ఇప్పుడు జల వివాదాలను రెచ్చగొడుతున్న కేసీఆర్‌కు బుద్దిలేదని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి అత్యంత ద్రోహి కేసీఆర్ అని, కేసీఆరే కృష్ణాజలాలను దోచుకోమని చెప్పి ఇప్పుడేందుకు గగ్గోలు పెడుతున్నాడని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ గురించి ఎప్పుడు మాట్లాడినా అక్కడి కరువు, వలసల గూరించే మాట్లాడేవారని, ఏడేళ్ల తర్వాత కూడా అదే పాట పాడుతున్నారని […]
దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాలను తరలించుకుపోవాలని చెప్పిందే సీఎం కేసీఆర్అని, అసెంబ్లీ వేదికగా రాయలసీమకు నీళ్లు తీసుకుపోవాలని చెప్పాడని, ఇప్పుడు జల వివాదాలను రెచ్చగొడుతున్న కేసీఆర్‌కు బుద్దిలేదని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి అత్యంత ద్రోహి కేసీఆర్ అని, కేసీఆరే కృష్ణాజలాలను దోచుకోమని చెప్పి ఇప్పుడేందుకు గగ్గోలు పెడుతున్నాడని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ గురించి ఎప్పుడు మాట్లాడినా అక్కడి కరువు, వలసల గూరించే మాట్లాడేవారని, ఏడేళ్ల తర్వాత కూడా అదే పాట పాడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్‌కు బుద్ది లేదని.. ఆయన మంత్రులకు జ్ఞానం లేదన్నారు. నీళ్లు–నిజాలు అనే అంశంపై తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజకీయ పక్షాల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఏపీ వాళ్లు తీసుకోవచ్చని అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టి ఇప్పుడు ఏపీ వాళ్లని తిడుతారా అని ప్రశ్నించారు. ఆంధ్రా మిత్రులు కూడా తాము తెలంగాణ బేసిన్‌లో ఉన్నామని, కృష్ణా జలాలపై హక్కు ఉంటుందని గుర్తుపెట్టుకొని మాట్లాడాలని సూచించారు.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కారుడు కాదని, ఒక్క లాఠీ దెబ్బ కూడా తినలేదన్నారు. కాళేశ్వరం క్రింద ఒక్క ఎకరాకు అధికంగా నీళ్లు ఇవ్వలేదని, తెలంగాణను కేసీఆర్ ఏం చేయదలుచుకున్నారని ప్రశ్నించారు. కృష్ణా జలాలను ఏపీ తీసుకువెళ్లాలనేదే కేసీఆర్ఆలోచన అని, గోదావరి నీళ్లు తెచ్చి కమీషన్ తీసుకోవాలనేదే కేసీఆర్ ప్లాన్ అని నాగం విమర్శించారు. అసలు సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టు రూపకల్పన ప్రగతిభవన్‌లోనే జరిగిందని, మెఘా కృష్ణారెడ్డికి టెండర్ ఇప్పించి వాటాలు పంచుకున్నారన్నారు. ఏడేండ్ల నుంచి సమస్య ఉన్న కృష్ణా జలాలపై ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఒక్కడైన ఈటల రాజేందర్‌ను సతాయించే సమయాన్ని సాగునీటి ప్రాజెక్టులపై పెడితే బాగుండన్నారు.
రివర్ లిఫ్టింగ్ పేరుతో తెలంగాణను మోసం చేస్తున్నాడని, తెలంగాణ మంత్రులు అజ్ఞానులని, కేసీఆర్ మాయలు చేసి బతుకుతున్నారన్నారు. సీఎంను తిట్టాలనే ఉద్దేశం కాదని, ప్రజల బాధలు చూడలేక మాట్లాడుతున్నామని, నాలుగున్నర లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎన్ని ఇండ్లు నిర్మించాడన్నారు. బేసిన్‌లో ఉన్నవారి అవసరాలు తీరిన తర్వాతే మిగితా వాళ్లకు ఇవ్వాలనే చట్టం ఉందని, కృష్ణా పరివాహక ప్రాంతం 69 శాతం ఇక్కడే ఉందని, కానీ మనకే నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేండ్లలో కనీసం కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదని, రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే పాలమూరులో 8 లక్షల ఎకరాలకు నీరు అందేదన్నారు.
కేసీఆర్ ఒక మూర్ఖుడు అని, దోచుకుపోమని చెప్పి ఇప్పుడు ఎందుకు తిడుతున్నారని నాగం ప్రశ్నించారు. నీళ్ల దోపిడిపై ఎన్ని లేఖలు రాసినా ఒక్క లేఖ కూడా సీఎం చదవలేదన్నారు. ఇప్పుడు ఆంధ్రులు రాక్షసులు అంటూ మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ప్రాజెక్టులు కట్టుకోండి అన్నప్పుడు ఇప్పుడున్న మంత్రులు అప్పుడు సన్నాసుల్లగా చప్పట్లు కొట్టారన్నారు. శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు అని కేసీఆర్‌కు ఒక్కడికే తెలుసన్నట్లుగా మాట్లాడుతున్నాడని, ప్రాజెక్టులపైనా, విద్యుత్ఉత్పత్పిపై అవగాహన ఉందా అని నాగం ప్రశ్నించారు. జూరాల స్టేజ్–2 ఉందనే విషయం ఎవరికీ తెలియదన్నారు. కేఆర్ఎంబీ బృందానికి పోతిరెడ్డిపాడు పరిశీలనకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని నాగం నిలదీశారు.
తెలంగాణ మాటలకే పరిమితం అయింది : రంగారెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్
తెలంగాణ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం అయిందని, ఏపీ మాత్రం అనుకున్నట్టుగానే పనులు చేసుకుంటూ వెళ్తుందని రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి అన్నారు. బచావత్ట్రిబ్యునల్అవార్డు జూరాలకు కేటాయించారు తప్ప కొత్తగా అలాట్చేసిందేమీ లేదన్నారు. ఏపీ వరద నీటి పేరుతో ప్రాజెక్టులు కట్టుకుంటుందని, ఎవరికీ తెలియకుండానే.. అనుమతులు లేకుండానే 400 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను కట్టుకున్నారని వివరించారు. నీళ్లపై అవగాహన లేకపోవడంతోనే నష్టపోతున్నామని, జోగులాంబ ప్రాజెక్టు వయోబిలిటీ కాదన్నారు. ఏపీకి నీటి లభ్యతపై క్షుణమైన అవగాహన ఉందని, తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీలను కూడా వినియోగించుకోలేకపోతున్నామని, టీఎంసీల లెక్కలు పక్కనపెట్టి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. రంగారెడ్డి, మహబూబ్నగర్జిల్లాల కోసం 500 టీఎంసీల అవసరం ఉంటుందని, జూరాల నుంచి ఎత్తిపోసుకునే అవకాశం ఉందని, జూరాలపై 80 టీఎంసీల రిజర్వాయర్ అవసరమని రంగారెడ్డి అన్నారు.
రాజకీయ లబ్ధికోసమే జల వివాదాన్ని సాగదీస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ఆరోపించారు. ఏడేండ్ల నుంచి లేని వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. జగన్అధికారంలోకి వచ్చిన వెంటనే అనుమతులు లేకున్నా 88 వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకెళ్తానని స్పష్టంగా చెప్పాడని, కేసీఆర్ దీనిపై నిర్లక్ష్యం వహించాడన్నారు. పోతిరెడ్డిపాడుపై పోరాటం చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడుకు దగ్గరలో సంగమేశ్వరం నుంచి నీళ్ల దోపిడికి మళ్లీ కుట్ర చేశారని, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలిసినా కేసీఆర్ తెలియనట్లు నాటకాలాడుతున్నారన్నారు. ఆర్డీఎస్ నీళ్ల దోపిడీకి ఏపీ కుట్ర చేస్తుందని సంపత్‌కుమార్ ఆరోపించారు.
రెండు రాష్ట్రాల మధ్య వాటర్ పంచాయతీ కేసీఆర్, జగన్ పెట్టిందేనని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పంచాయతీ నడుస్తుందని టీజేఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీశైలం రెడ్డి అన్నారు. జల జగడంపై అఖిల పక్షాన్ని పిలువాలని, అందరం కలిసి ఢిల్లీలో పోరాటం చేద్దామన్నారు. బేసిన్లు లేవు, బేషజాలు లేవని చెప్పిన కేసీఆర్ రాష్ట్రంలో విపక్షాలను పిలిచి మాట్లాడటంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని శ్రీశైలం రెడ్డి ప్రశ్నించారు.
రాజకీయ లబ్ది కోసమే జల జగడాలు పరిష్కారం కావడం లేదని తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బ్రిజేష్ కుమార్ తీర్పుపై 15 ఏండ్ల నుంచి వేచి చూస్తున్నామని, అపెక్స్ కౌన్సిల్‌లో తేల్చుకోవాలని బ్రిజేష్ కుమార్ వెల్లడించారని, కానీ ఇప్పటికీ అది పెండింగ్‌లోనే ఉందన్నారు. పోతిరెడ్డిపాడుతో రోజుకు 10 టీఎంసీల నీళ్లు తరలిస్తే 23 రోజుల్లో శ్రీశైలం ఖాళీ అవుతుందన్నారు. రాయలసీమ ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్‌లో అనుమతి లేకున్నా, ఎన్జీటీ చెప్పినా వినకుండా ఏపీ నిర్మాణం చేస్తుందన్నారు. జల వివాదాల్లో రాజకీయాలను పక్కనపెట్టి వివాదాలను పరిష్కరించాలని కేంద్రాన్ని మల్లారెడ్డి సూచించారు.
రెచ్చగొట్టే ప్రకటనలతోనే తెలంగాణ, రాయలసీమ ప్రజలు ఆందోళనలో ఉన్నారని, సమస్య పరిష్కారానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికలను కేంద్రం ముందు ఉంచాలని, కేంద్రంపై పోరాడుతానని చెప్పే కేసీఆర్ కార్యాచరణ ఎందుకు ప్రకటించడం లేదని పశ్య పద్మ ప్రశ్నించారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ఒక వివక్ష చూపుతున్నారని, కొన్ని ప్రాజెక్టులను స్పీడ్‌గా చేస్తున్నారని టీడీపీ నేత చంద్రశేఖరెడ్డి అన్నారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కొత్తది కాదని, ఉమ్మడి పాలకుల సమయంలో మొదలుపెట్టిందేనన్నారు. నీటి వివాదాలను పరిష్కరించేందుకే బోర్డులు ఏర్పాటు చేస్తారని, కానీ అవి పనిచేసేలా చూసే బాధ్యత కేంద్రానిదేనన్నారు. విభజన చట్టంలోని సెక్షన్85ను అమలు చేయాలని, కృష్ణా జలాల్లో మన వాటాను పూర్తిస్థాయిలో వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కర్ణాటక నుంచే అతిపెద్ద ప్రమాదం ఉందని, ఆల్మట్టి పనులు చాలా వేగంగా చేస్తున్నారని, ఆల్మట్టి ఎత్తు పెంపు పనులు చేస్తే జూరాలకు నీళ్లు రావన్నారు. ఎక్కడి నీళ్లను అక్కడే ఆపుకునేలా కర్ణాటక రాష్ట్రం ప్రాజెక్టులు కడుతుందని సంపత్ కుమార్ ఆరోపించారు.
అనంతరం రాజకీయ పార్టీలు ఏడు తీర్మానాలు చేశాయి. జూరాల నుంచే నీటిని ఒడిసిపట్టుకోవాలని, జోగులాంబ వయోబిలిటీ కాదని తీర్మానం చేశారు. అదేవిధంగా జల వివాదాలపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు. కృష్ణా జలాల పంపిణీపై మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, రెండు రాష్ట్రాల సీఎంలు కర్ణాటకలో కడుతున్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని, ఎస్‌ఎల్‌బీసీని వెంటనే పూర్తి చేయాలని, జాతీయ, అంతర్జాతీయ న్యాయ సూత్రాల మేరకే నీటి పంపకాలు జరుగాలని, ఆర్డీఎస్‌ను పట్టించుకోవాలంటూ తీర్మానం చేసి సీఎంకు పంపిస్తామన్నారు.