కల్నల్ సంతోష్‌బాబు త్యాగం వెలకట్టలేనిది: సీఎం
దిశ, న్యూస్‌బ్యూరో: భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాను కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు, అంత్యక్రియల […]
దిశ, న్యూస్‌బ్యూరో: భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాను కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు, అంత్యక్రియల వరకు ప్రతీకార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్‌రెడ్డిని సీఎం ఆదేశించారు.