కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ.5 కోట్లు : సీఎం కేసీఆర్

భారత్-చైనా సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి శుక్రవారం సీఎం కేసీఆర్ రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేగాకుండా కుటుంబానికి నివాస స్థలం, సంతోష్ బాబు భార్యకు గ్రూపు-1 స్థాయి ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇట్టి సాయాన్ని స్వయంగా తానే సూర్యాపేటకు వెళ్లి కుటుంబానికి అందజేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం […]

Update: 2020-06-19 08:54 GMT

భారత్-చైనా సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి శుక్రవారం సీఎం కేసీఆర్ రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేగాకుండా కుటుంబానికి నివాస స్థలం, సంతోష్ బాబు భార్యకు గ్రూపు-1 స్థాయి ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇట్టి సాయాన్ని స్వయంగా తానే సూర్యాపేటకు వెళ్లి కుటుంబానికి అందజేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన మిగతా 19 మంది జవాన్ల కుటుంబాలకు తలో రూ.10లక్షల చొప్పున సాయం ప్రకటించారు.

Tags:    

Similar News