కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు :జగన్
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు అని సీఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరం పర్యటనలో భాగంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ పైలాన్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇంతమందికి మంచి చేసే అవకాశం దక్కిందన్నారు. దేశ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు అని సీఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరం పర్యటనలో భాగంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ పైలాన్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇంతమందికి మంచి చేసే అవకాశం దక్కిందన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పేదలు, రైతులు, విద్యార్ధులు, అక్కచెల్లెమ్మలు, వందల సామాజిక వర్గాలకు అండగా నిలిచామని స్పష్టం చేశారు. 50 లక్షలకు పైగా రైతులకు రైతు భరోసా సాయం అందించామన్నారు. 62 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. 15 లక్షలకు పైగా విద్యార్ధుల చదువులకు తోడుగా నిలబడ్డానని తెలిపారు. సున్నా వడ్డీ పథకం, ఇన్‌పుట్ సబ్సిడీ అందించి రైతన్నలకు అండగా నిలబడ్డానన్నారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం జగన్ తెలిపారు.
తమ ప్రభుత్వం కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అని సీఎం జగన్ అన్నారు. కొత్తగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. గుంకలాం లేఅవుట్‌లో 12,301 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో.. ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నామని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లను పూర్తిచేసేందుకు రూ.9వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం జగన్.