‘పరీక్షంటే.. సీఎం పారిపోయాడు’

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 26వ తేదీ వరకు నిరవధిక వాయిదా వేశాక మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ‘సీఎం.. విశ్వాస పరీక్షకు దూరంగా పారిపోతున్నాడు. ఎందుకంటే సర్కారుకు మెజార్టీ సభ్యుల మద్దతు లేదని ఆయనకు తెలుసు. బీజేపీకి మెజార్టీ ఉన్నది. వీలైనంత తొందరగా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ లాల్‌జీ టాండన్‌ను కోరాం. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను తప్పకుండా కాపాడతారని హామీనిచ్చారు.’ అసెంబ్లీ వాయిదా తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ తనతోపాటు […]

Update: 2020-03-16 05:38 GMT

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 26వ తేదీ వరకు నిరవధిక వాయిదా వేశాక మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ‘సీఎం.. విశ్వాస పరీక్షకు దూరంగా పారిపోతున్నాడు. ఎందుకంటే సర్కారుకు మెజార్టీ సభ్యుల మద్దతు లేదని ఆయనకు తెలుసు. బీజేపీకి మెజార్టీ ఉన్నది. వీలైనంత తొందరగా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ లాల్‌జీ టాండన్‌ను కోరాం. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను తప్పకుండా కాపాడతారని హామీనిచ్చారు.’ అసెంబ్లీ వాయిదా తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ తనతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గవర్నర్‌ను కలిసేందుకు రాజ్ భవన్ వెళ్లారు. ఫ్లోర్ టెస్ట్‌కు ఆదేశించాలని సుప్రీంకోర్టులోనూ బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు.

Tags : shivraj singh chouhan, former CM, madhya pradesh, governor, floor test, majority, kamal nath govt

Tags:    

Similar News