అస్సలు భరించకూడదు.. సీఎం సీరియస్

దిశ, వెబ్ డెస్క్: శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన పోలీసు, ఉద్యోగం అండ చూసుకొని ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన జార్ఖండ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు నడిరోడ్డుపై ఓ యువతి చెంప పగలగొట్టాడు. అక్కడితో ఆగకుండా విచక్షణారహితంగా ఆమె జుట్టుపట్టుకొని ఈడ్చాడు.ఈ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయింది. చివరకు విషయం సీఎం హేమంత్ సోరెన్ వరకూ వెళ్లింది. ఈ వీడియో […]

Update: 2020-07-28 11:37 GMT

దిశ, వెబ్ డెస్క్: శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన పోలీసు, ఉద్యోగం అండ చూసుకొని ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన జార్ఖండ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు నడిరోడ్డుపై ఓ యువతి చెంప పగలగొట్టాడు. అక్కడితో ఆగకుండా విచక్షణారహితంగా ఆమె జుట్టుపట్టుకొని ఈడ్చాడు.ఈ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయింది. చివరకు విషయం సీఎం హేమంత్ సోరెన్ వరకూ వెళ్లింది. ఈ వీడియో చూసిన ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. డీజీపీ ఎమ్‌వీ రావుకు ట్యాగ్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. ‘ఇలాంటి నీచమైన, అనుచితమైన ప్రవర్తనను అస్సలు భరించకూడదు’ అని ట్వీట్ చేశారు. వీడియోలోని పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై వెంటనే స్పందించిన డీజీపీ సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసి, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

Tags:    

Similar News