వర్క్ ఫ్రం హోం చేయనున్న సీఎం

దిశ, వెబ్ డెస్క్: కరోనా విజృంభన వల్ల అన్ని రంగాలు మూతపడ్డాయి. కొన్ని సంస్థలు కొంతమేర నడుస్తున్నప్పటికీ చాలా వరకు వర్క్ ఫ్రం హోం చేస్తున్నాయి. సాఫ్ట్ వేర్ రంగం మార్చి నుంచి అదే పంథాను అనుసరిస్తోంది. ప్రస్తుతం కరోనా తీవ్రత పెరుగుతుండడంతో అత్యవసర సేవలు తప్ప మిగతా అన్ని విభాగాలు ఇంటికే పరిమితం అయ్యాయి. మరోవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కరోనా వైరస్ సీఎం ఆఫీస్ ఆఫీసులను వదలడం లేదు. తెలంగాణ, ఏపీ సీఎం కార్యాలయాల్లో […]

Update: 2020-07-10 07:33 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా విజృంభన వల్ల అన్ని రంగాలు మూతపడ్డాయి. కొన్ని సంస్థలు కొంతమేర నడుస్తున్నప్పటికీ చాలా వరకు వర్క్ ఫ్రం హోం చేస్తున్నాయి. సాఫ్ట్ వేర్ రంగం మార్చి నుంచి అదే పంథాను అనుసరిస్తోంది. ప్రస్తుతం కరోనా తీవ్రత పెరుగుతుండడంతో అత్యవసర సేవలు తప్ప మిగతా అన్ని విభాగాలు ఇంటికే పరిమితం అయ్యాయి. మరోవైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కరోనా వైరస్ సీఎం ఆఫీస్ ఆఫీసులను వదలడం లేదు. తెలంగాణ, ఏపీ సీఎం కార్యాలయాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో కరోనా బారినపడ్డారు.

తాజాగా కర్ణాటకలో కూడా సీఎం కార్యాలయాల్లోని అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది.

బెంగళూరులోని సీఎం కార్యాలయంలో ఉద్యోగికి పాజిటివ్ రావడంతో సీఎం యడియురప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. తనతోపాటు ఉద్యోగులు, సిబ్బంది కొద్ది రోజుల పాటు ఇంటి నుంచి విధులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అందరు ఉద్యోగులకు టెస్టులు చేయిస్తున్నామని, మిగతా వారికి వైరస్ వ్యాపించకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రజలెవరు భయపడొద్దని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన ప్రజలను కోరారు.

Tags:    

Similar News