ఆన్‌లైన్‌లో సీఎల్పీ భేటీ… కీలక అంశాలపై చర్చ

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా నలుగురు ఒకచోట కూర్చునే పరిస్థితులు లేకుండా పోయాయి. దీని కారణంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు, సమావేశాలు ఆన్‌లైన్‌లో జరిగిపోయాయి. ఇటీవల వామపక్షాలు సైతం ఆన్‌లైన్ బహిరంగా సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆన్‌లైన్‌లో సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పోతిరెడ్డిపాడు, కరోనా మహమ్మారి లాంటి పలు కీలక అంశాలపై సీఎల్పీ విస్తృతంగా […]

Update: 2020-08-09 05:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా నలుగురు ఒకచోట కూర్చునే పరిస్థితులు లేకుండా పోయాయి. దీని కారణంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు, సమావేశాలు ఆన్‌లైన్‌లో జరిగిపోయాయి. ఇటీవల వామపక్షాలు సైతం ఆన్‌లైన్ బహిరంగా సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆన్‌లైన్‌లో సీఎల్పీ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో పోతిరెడ్డిపాడు, కరోనా మహమ్మారి లాంటి పలు కీలక అంశాలపై సీఎల్పీ విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. గాంధీ ఆసుపత్రికి ప్రభుత్వం వెంటనే రూ.3వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాల్లోని ఆసుపత్రులకు రూ.2వేల కోట్లు కేటాయించాలని కోరారు. సింగూరు, మంజీరా డ్యామ్‌లను ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని తెలిపారు.

Tags:    

Similar News