ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం – సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి, పరిష్కారించే విధంగా పోరాడాలని, సమావేశంలో నిర్ణయించుకున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని సమస్యలను చర్చించాలంటే.. ఎక్కువ రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీలో డిమాండ్ చేస్తామని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి మరింత సమయం ఇవ్వాలని కోరతామని […]
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి, పరిష్కారించే విధంగా పోరాడాలని, సమావేశంలో నిర్ణయించుకున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని సమస్యలను చర్చించాలంటే.. ఎక్కువ రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీలో డిమాండ్ చేస్తామని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి మరింత సమయం ఇవ్వాలని కోరతామని తెలిపారు. అయితే సభలో ప్రధానంగా దళిత బంధు, ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదన, పోడుభూములు, ధరణి పోర్టల్ సమస్యలు తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ భేటీలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్కలు పాల్గొన్నారు.