క‌మీష‌న్ల కోస‌మే కొత్త ప్రాజెక్టులు : భట్టి

దిశ‌, ఖ‌మ్మం: క‌మీష‌న్ల కోస‌మే ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టార‌ని మ‌ధిర ఎమ్మెల్యే, సీఎల్పీనేత భ‌ట్టి విక్ర‌మార్క ధ్వ‌జ‌మెత్తారు. కాళేశ్వ‌రంపై ఉన్న శ్ర‌ద్ధ డిండిలాంటి పాత ప్రాజెక్టుపై ఎందుకు లేద‌ని నిల‌దీశారు. రాష్ట్ర‌ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని టీఆర్‌ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో పాలేరు జలాశయం వద్ద చేప‌ట్టిన జల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించిన విష‌యం తెలిసిందే. దీంతో భ‌ట్టి అదే రోజూ ఖ‌మ్మం జిల్లా పార్టీ […]

Update: 2020-06-04 08:12 GMT

దిశ‌, ఖ‌మ్మం: క‌మీష‌న్ల కోస‌మే ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టార‌ని మ‌ధిర ఎమ్మెల్యే, సీఎల్పీనేత భ‌ట్టి విక్ర‌మార్క ధ్వ‌జ‌మెత్తారు. కాళేశ్వ‌రంపై ఉన్న శ్ర‌ద్ధ డిండిలాంటి పాత ప్రాజెక్టుపై ఎందుకు లేద‌ని నిల‌దీశారు. రాష్ట్ర‌ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని టీఆర్‌ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో పాలేరు జలాశయం వద్ద చేప‌ట్టిన జల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించిన విష‌యం తెలిసిందే. దీంతో భ‌ట్టి అదే రోజూ ఖ‌మ్మం జిల్లా పార్టీ కార్యాలయంలోనే కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్షకు దిగిన విషయం విదితమే. గురువారం కూసుమంచి మండ‌లం పాలేరు గ్రామంలో కృష్ణానదిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై భట్టి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా నాగార్జున సాగ‌ర్ జ‌లాల దోపిడీ ఎలా జ‌రుగుతోందో రైతులకు, పార్టీ నాయకులకు, కార్య‌క‌ర్త‌ల‌కు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటిని కాపాడుకునేదిపోయి..ఏపీ రాష్ట్రం పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలతో ఉన్న నీళ్లను తరలించుకుపోతుంటే టీఆర్‌ఎస్ ప్ర‌భుత్వం ఎందుకు మాట్లాడ‌టం లేద‌న్నారు.సీఎం కేసీఆర్ ఎందుకు గ‌ట్టిగా తన వాద‌న‌ను వినిపించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు పూర్తయినా..2014కు ముందు చేపట్టిన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. పాత ప్రాజెక్టు అయితే కమీషన్‌ రాదన్న కుట్రతోనే పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయట్లేదని ఆరోపించారు.సీఎం కేసీఆర్‌ చేతగానితనం వల్లే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌..పోతిరెడ్డిపాడు విస్తరణకు జీవో చేశారన్నారు. డిండి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాళేశ్వరం ఎలా పూర్తయిందని ప్రశ్నించారు.

తాము చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని పోలీసుల అండతో అడ్డుకున్నారని, అక్రమ అరెస్టులపై డీజీపీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా..ఆయన కనీసం ఫోన్‌లోనూ స్పందించక‌పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.రాష్ట్రంలో కొంత‌మంది ఐపీఎస్‌ అధికారులు కూడా సీఎం కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.రోజుకు 3.25 టీఎంసీల నీళ్లు వచ్చే ఎస్‌ఎల్‌బీసీకి రూ.వెయ్యి కోట్లు పెట్టడానికి సీఎం కేసీఆర్‌ ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో జ‌ల‌దోపిడీని అడ్డుకునేందుకు క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లకు శ్రీకారం చుడుతున్నట్టు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఈనెల 5న మంజీరా డ్యాం సందర్శనకు, 6న గోదావరిపై పెండింగ్‌ ప్రాజెక్టుల సందర్శనకు వెళతామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయవాది మద్ది శ్రీనివాస్ రెడ్డి,కూసుమంచి మండలాధ్యకులు గురవయ్య,కాంగ్రెస్ నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News