సాయంత్రం 5 తర్వాత షాపులు బంద్!

దిశ, మహబూబ్‎నగర్: తెలంగాణలో కరోనా వైరస్ క్రమేనా విజృంభిస్తోంది. జీహెచ్ఎంసీలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వస్త్ర దుకాణాలు తెరిచి ఉంటాయని.. మహబూబ్‌నగర్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. పాలమూరు పట్టణంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సందర్భంగా వ్యాధి ప్రబలకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు స్పష్టం చేశారు. రేపటి నుంచి జూన్ 18 వరకు సాయంత్రం 5 గంటల వరకే […]

Update: 2020-06-18 10:03 GMT

దిశ, మహబూబ్‎నగర్: తెలంగాణలో కరోనా వైరస్ క్రమేనా విజృంభిస్తోంది. జీహెచ్ఎంసీలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వస్త్ర దుకాణాలు తెరిచి ఉంటాయని.. మహబూబ్‌నగర్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. పాలమూరు పట్టణంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సందర్భంగా వ్యాధి ప్రబలకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు స్పష్టం చేశారు. రేపటి నుంచి జూన్ 18 వరకు సాయంత్రం 5 గంటల వరకే షాపులు తెరిచి ఉండేందుకు వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. అటు షాపింగ్ మాల్స్ నిర్వహకులు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News