టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు

దిశ,విశాఖపట్నం: విజయనగరం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ నేతల్లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీనియర్‌ నాయకులు అశోక్‌ గజపతిరాజుకు వ్యతిరేకంగా టీడీపీలో మొదటిసారి ప్రత్యక్షంగా ధిక్కార స్వరం వినిపించింది. కొన్నాళ్ళుగా అశోక్‌ బంగ్లాలోనే విజయనగరం టీడీపీ కార్యాలయం కూడా నడుస్తోంది. అయితే, టీడీపీ సీనియర్‌ నాయకులు అశోక్ గజపతిరాజు బంగ్లాను కాదని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వంతంగా పార్టీ కార్యాలయాన్నిబుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కె.ఎ నాయుడు, నలుగురు కార్పొరేట్ అభ్యర్ధులు, […]

Update: 2020-12-09 06:51 GMT

దిశ,విశాఖపట్నం: విజయనగరం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ నేతల్లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీనియర్‌ నాయకులు అశోక్‌ గజపతిరాజుకు వ్యతిరేకంగా టీడీపీలో మొదటిసారి ప్రత్యక్షంగా ధిక్కార స్వరం వినిపించింది. కొన్నాళ్ళుగా అశోక్‌ బంగ్లాలోనే విజయనగరం టీడీపీ కార్యాలయం కూడా నడుస్తోంది. అయితే, టీడీపీ సీనియర్‌ నాయకులు అశోక్ గజపతిరాజు బంగ్లాను కాదని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వంతంగా పార్టీ కార్యాలయాన్నిబుధవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కె.ఎ నాయుడు, నలుగురు కార్పొరేట్ అభ్యర్ధులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ… పార్టీకి సంబంధించిన ఏ సమాచారం కూడా తమకు అందకపోవటం, జిల్లా కేంద్రంలో జెండా ఉనికి కోల్పోతున్నందు వలనే కార్యాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తామని మీసాల గీత వెల్లడించారు. అయితే దీనిపై అశోక్‌గజపతిరాజు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం గమనర్హం.

Tags:    

Similar News