సీఏఏ సమర్థకులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ

ఢిల్లీలోని జాఫ్రాబాద్ ఏరియాలో శనివారం రాత్రి సీఏఏను వ్యతిరేకిస్తూ సుమారు వెయ్యి మంది మహిళలు, 500 మంది పురుషులు ప్రదర్శనకు దిగిన ప్రాంతానికి సమీపంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. జాఫ్రాబాద్‌కు సుమారు కిలోమీటర్ దూరంలోని మౌజ్‌పూర్ ప్రాంతంలో సీఏఏ వ్యతిరేకులు, సమర్థకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరుపక్షాలు పరస్పరం రాళ్లు విసురుకున్నాయి. ఈ ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఘర్షణలను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగించినట్టు సమాచారం. బీజేపీ నేత కపిల్ మిశ్రా ప్రాతినిధ్యం వహించిన […]

Update: 2020-02-23 06:53 GMT

ఢిల్లీలోని జాఫ్రాబాద్ ఏరియాలో శనివారం రాత్రి సీఏఏను వ్యతిరేకిస్తూ సుమారు వెయ్యి మంది మహిళలు, 500 మంది పురుషులు ప్రదర్శనకు దిగిన ప్రాంతానికి సమీపంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. జాఫ్రాబాద్‌కు సుమారు కిలోమీటర్ దూరంలోని మౌజ్‌పూర్ ప్రాంతంలో సీఏఏ వ్యతిరేకులు, సమర్థకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరుపక్షాలు పరస్పరం రాళ్లు విసురుకున్నాయి. ఈ ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఘర్షణలను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగించినట్టు సమాచారం.

బీజేపీ నేత కపిల్ మిశ్రా ప్రాతినిధ్యం వహించిన కరవాల్ నగర్‌కు సమీపంలోనే మౌజ్‌పూర్ ఉన్నది. ఈ ఏరియాలో కపిల్ మిశ్రాకు అభిమానులు అధికమని ఓ పాత్రికేయుడు తెలిపారు. అయితే, మౌజ్‌పూర్‌లో ఈ ఘర్షణకు పూర్వం.. కపిల్ మిశ్రా ఒక ట్వీట్ చేశారు. షహీన్‌బాగ్ ఒక ప్రయోగమని మోడీ చెప్పిందే నిజమైందని, ఇప్పుడు జాఫ్రాబాద్ కూడా మరో షహీన్‌బాగ్‌గా మారనుందని ట్వీట్ట‌లో పేర్కొన్నారు. భారత దేశ చట్టాలు అమలు కాని ఇలాంటి ప్రదర్శనలు పెరుగుతూనే ఉంటాయని, మీ ఇంటిదాకా వచ్చే వరకు మౌనంగా ఉండండి.. అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తర్వాతే సీఏఏ సమర్థకులు జాఫ్రాబాద్ వైపుగా ప్రయాణించారని ఆ పాత్రికేయుడు వివరించారు.

Read also..

ఆ వీడియో పోస్ట్ చేసిందెవరు..?

Full View

Tags:    

Similar News