సీఐ కార్యాలయం ఎదుట ఇరువర్గాల ఘర్షణ
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని సీఐ కార్యాలయం ఎదుట ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక మజీద్ ఇమామ్ ఎంపిక విషయంలో రెండు వర్గాల మధ్య మాటల యుద్దం నెలకొంది. ఈ ఘర్షణ చిలికి గాలివానలా మారడంతో రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో లాఠీఛార్జ్ చేశారు. ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… రుద్రూరు జవహర్ నగర్ కాలనీలోని మజీద్‌లో పనిచేస్తున్న తనకు ఏడాది నుంచి […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని సీఐ కార్యాలయం ఎదుట ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక మజీద్ ఇమామ్ ఎంపిక విషయంలో రెండు వర్గాల మధ్య మాటల యుద్దం నెలకొంది. ఈ ఘర్షణ చిలికి గాలివానలా మారడంతో రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో లాఠీఛార్జ్ చేశారు. ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… రుద్రూరు జవహర్ నగర్ కాలనీలోని మజీద్‌లో పనిచేస్తున్న తనకు ఏడాది నుంచి నెల వేతనం ఇవ్వడం లేదని ఆ మజీద్ ఇమామ్ నిజాంబాద్ వారికి ఫోన్ ద్వారా పిర్యాదు చేసారు. ఈ విషయంలో నిజామాబాద్ మజీద్‌లో పనిచేసే పై స్థాయి వారికి, సదరు ఇమామ్‌కు మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇరువురు ఒకరిపై ఒకరు రుద్రూర్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోన్నారు. దీంతో ఇరు వర్గాలను రుద్రూరు సీఐ కార్యాలయానికి అధికారులు రప్పించారు. ఇమామ్‌కు సంవత్సరం డబ్బులు ఒక లక్ష రూపాయల పైన రావాల్సి ఉందని.. అందులో ప్రస్తుతం 35 వేల రూపాయలు ఇచ్చి కొత్తగా ఇమామ్ నియామకం చేసుకుంటున్నట్టు ఇరు వర్గాల మధ్య ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి ఒప్పంద పత్రం సైతం రాసుకున్నారు. అనంతరం స్టేషన్ బయట ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ నెలకొనడంతో ఇరు వర్గాలు భౌతిక దాడులు చేసుకున్నాయి. ఇరు వర్గాలను చెదర గొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.