గే లాయర్‌ను జడ్జీగా నియమించడంపై తర్జనభర్జన
న్యూఢిల్లీ: సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలు, వివరాలను తెలుపాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే కోరారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సీజేఐ బాబ్డే ఈ లేఖ రాశారు. వివరాలు అందిస్తే నిర్ణయం తీసుకోవడం సులువు అవుతుందని తెలిపారు. ఇది సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి రాసే అధికారిక లేఖ కాదని సంబంధితవర్గాలు వివరించాయి. సీనియర్ లాయర్ సౌరభ్ కిర్పాల్‌ను న్యాయమూర్తిగా నియమించాలని 2017లోనే […]
న్యూఢిల్లీ: సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలు, వివరాలను తెలుపాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే కోరారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సీజేఐ బాబ్డే ఈ లేఖ రాశారు. వివరాలు అందిస్తే నిర్ణయం తీసుకోవడం సులువు అవుతుందని తెలిపారు.
ఇది సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి రాసే అధికారిక లేఖ కాదని సంబంధితవర్గాలు వివరించాయి. సీనియర్ లాయర్ సౌరభ్ కిర్పాల్‌ను న్యాయమూర్తిగా నియమించాలని 2017లోనే ఢిల్లీ హైకోర్టు ఏకగ్రీవంగా సిఫారసులు చేసింది. వీటిపై మార్చి 2న కొలీజియం భేటీ అయింది. కేంద్రం నుంచి మరిన్ని ఇన్‌పుట్‌లు వచ్చే వరకు ఆయన ఉద్యోగోన్నతిని వాయిదా వేసింది. దీంతో మొత్తంగా ఇప్పటికీ కిర్పాల్ ఉద్యోగోన్నతి నాలుగు సార్లు వాయిదా పడినట్టయింది. ఢిల్లీ హైకోర్టు సిఫారసుల తర్వాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కిర్పాల్ సహచరిణి విదేశీయురాలు కావడంతో సెక్యూరిటీ ముప్పు ఉండే అవకాశముందని హెచ్చరించింది.