రామప్ప దేవాలయంలో ఎన్వీ రమణ ప్రత్యేక పూజలు
దిశ, ములుగు: రామప్ప దేవాలయాన్ని శనివారం సాయంత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మహబూబాబాద్ ఎంపీ కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సీతక్క ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. ఆలయ పూజారులు చీఫ్ జస్టిస్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామలింగేశ్వర ఆలయంలోని శివ లింగానికి నమస్కరించిన చీఫ్ జస్టిస్ రమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప విశిష్టతను టూరిజం అధికారులు సీజేఐకి వివరించారు. రామప్ప […]
దిశ, ములుగు: రామప్ప దేవాలయాన్ని శనివారం సాయంత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మహబూబాబాద్ ఎంపీ కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సీతక్క ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. ఆలయ పూజారులు చీఫ్ జస్టిస్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామలింగేశ్వర ఆలయంలోని శివ లింగానికి నమస్కరించిన చీఫ్ జస్టిస్ రమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప విశిష్టతను టూరిజం అధికారులు సీజేఐకి వివరించారు. రామప్ప ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చోటు సంపాదించుకోవడం నిజంగా తెలుగు ప్రజలంతా గర్వించే విషయమని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.