‘సిటీ’జెన్స్ స్ట్రీట్‌ఫుడ్ మిస్
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వల్ల ప్రజల జీవనశైలితోపాటు ఆహారపు అలవాట్లు ఒక్కసారిగా మారిపోయాయి. కరోనా రాకముందు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ.. ఏది పడితే ఆ స్ట్రీట్‌ఫుడ్ లాగించేసిన ప్రజలకు ఇప్పుడు ఆ రుచులు కరువయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో రద్దీగా ఉండే రోడ్ల పక్కన, షాపింగ్ కాంప్లెక్స్‌ల దగ్గర పానీపూరీ, చాట్ మసాలా.. ఇలా రకరకాల ఫుడ్ స్టాళ్ళు ఉండేవి. ప్రస్తుత లాక్‌డౌన్‌లో అవన్నీ కనుమరుగయ్యాయి. మామూలు రోజుల్లో సరదా కోసమో, స్నేహితులు కలిసినప్పుడో వీటి […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వల్ల ప్రజల జీవనశైలితోపాటు ఆహారపు అలవాట్లు ఒక్కసారిగా మారిపోయాయి. కరోనా రాకముందు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ.. ఏది పడితే ఆ స్ట్రీట్‌ఫుడ్ లాగించేసిన ప్రజలకు ఇప్పుడు ఆ రుచులు కరువయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో రద్దీగా ఉండే రోడ్ల పక్కన, షాపింగ్ కాంప్లెక్స్‌ల దగ్గర పానీపూరీ, చాట్ మసాలా.. ఇలా రకరకాల ఫుడ్ స్టాళ్ళు ఉండేవి. ప్రస్తుత లాక్‌డౌన్‌లో అవన్నీ కనుమరుగయ్యాయి. మామూలు రోజుల్లో సరదా కోసమో, స్నేహితులు కలిసినప్పుడో వీటి రుచి చూడడం ఆనవాయితీ. అయితే లాక్‌డౌన్ కారణంగా జిహ్వ చాపల్యాన్ని నెలరోజులుగా కంట్రోల్ చేసుకున్నారు.
నగరంలో వీటి వ్యాపారం ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల్లో ఉంటుంది. వీటి ద్వారా ప్రత్యక్షంగా వేలమంది స్వయం ఉపాధి పొందుతుంటారు. పరోక్షంగా కొన్ని లక్షల మంది బతుకుతారు. బజ్జీ నుంచి బర్గర్ దాకా రోడ్డు మీదే తిని తృప్తి పడే మిడిల్ క్లాస్ ప్రజలు లాక్‌డౌన్ రోజుల్లో తమ ఫుడ్ స్టైల్ మార్చుకోక తప్పలేదు. ఇవి చిన్న స్టాల్ లాగా కనిపిస్తున్నా ఒకరిద్దరు పనిచేస్తూ మరో ఇద్దరికి పనికల్పిస్తారు. స్టాల్ పెట్టుకున్నందుకు ఆ ప్లేస్ (పెద్ద దుకాణం) యజమానికి కొంత రెంట్ పేరుతో ముట్టజెప్పాలి. మున్సిపాలిటీ సిబ్బందికి, పోలీసులకు ఎంతోకొంత ఇచ్చుకోవాలి. లాక్‌డౌన్‌తో ఇవన్నీ క్లోజ్ అయ్యాయి.
కరోనా భయంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కొంచెం ఖరీదైనా సి విటమిన్ ను ఇచ్చే సంత్రా, మోసంబి, నిమ్మతో పాటు వాటర్ మిలాన్ లాంటి పండ్లు కొనుగోలు చేసి తినడం స్టార్ట్ చేశారు. ఎగువ, మధ్య తరగతి ప్రజలు నిన్న మొన్నటి దాకా ఫుడ్ డెలివరీ యాప్‌లతో చిరుతిళ్ల అవసరాలను తీర్చుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వాటిపై నిషేధం ఉంది.
డొమినోస్, కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్, బర్గర్‌కింగ్, పిజ్జాహట్, సబ్‌వే లాంటి బ్రాండెడ్ క్విక్ సర్వీసు రెస్టారెంట్ (క్యూఎస్ఆర్)లలో దొరికే చీజ్‌తో చేసిన పిజ్జా, బర్గర్‌లు ఖరీదు కావడంతో పానీపూరీ, బజ్జీ, సమోసా, పావ్‌బాజీ లాంటి లోకల్ ట్రెడిషనల్ చిరుతిళ్ల వైపు మళ్ళారు. వెస్టర్న్ స్టైల్ పిజ్జా బర్గర్లు, చైనీస్ స్టైల్ ఫ్రైడ్ రైస్, నూడుల్స్, మంచూరియా లాంటి వాటికోసం స్ట్రీట్ స్టాళ్లను, రోడ్ సైడ్ బళ్లను ఆశ్రయించేవారు. బ్రాండెడ్ రెస్టారెంట్లతో పోలిస్తే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ దగ్గరే ఎక్కువ కమీషన్ దొరుకుతుండడంతో స్విగ్గీ, జొమాటో డెలివరీ యాప్‌లు కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ ను సప్లై చేయడం ప్రారంభించాయి.
హైదరాబాద్ నగరంలో చిరుతిళ్లు, స్నాక్స్ తినే విషయంలో యువతే ఎక్కువ. ఐటీ ఎంప్లాయీస్ అయితే ఆఫీసుల్లో లంచ్‌కు బదులు స్ట్రీట్ ఫుడ్‌ను ఆర్డర్ చేసి తినడానికి అలవాటు పడ్డట్టు ఇటీవల ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ చేసిన అధ్యయనంలో తేలింది. లాక్‌డౌన్ కారణంగా స్ట్రీట్‌ఫుడ్ లేకపోవడంతో సూపర్ మార్కెట్లలో దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్‌కు డిమాండ్ ఏర్పడింది. చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్ల ర్యాకులన్నీ స్టాకు వచ్చీరాగానే ఖాళీ అవుతున్నాయి. ఉన్న స్టాకంతా అయిపోకముందే ఇండెంట్ పెట్టినా లారీలు తిరగడంలేదని, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర స్టాకు లేదనే కారణాలతో కొత్త సరుకు రావడంలేదు.
కరోనా పోయేదెన్నడో.. పిజ్జా తినేదెప్పుడో ?: హితేష్, ఇంజినీరింగ్ స్టూడెంట్
నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం. కానీ, డొమినోస్, పిజ్జాహట్‌లకు వెళ్లి తినేంత ఆర్థిక స్థోమత లేదు. రోడ్డు పక్కన స్టాల్‌తో సరిపెట్టుకుంటాను. ఇప్పుడు ఆ స్టాల్ తెరవట్లేదు. బైటకు వెళ్లడానికి పోలీసులు ఒప్పుకోవట్లేదు. ఇంట్లో భోజనం రొటీన్ అయిపోయింది. కరోనా ఎప్పుడు తగ్గుతుందో.. ఫేవరెట్ పిజ్జా ఎప్పుడు తింటానో?’
ఫీల్డ్ వర్క్‌తో బైట తినడం అలవాటైంది: శేఖర్, బ్యాంకు ఉద్యోగి
బ్యాంకులో మార్కెటింగ్ ఉద్యోగం కావడంతో ఎక్కువగా ఫీల్డ్ మీదనే ఉంటాను. లాక్‌డౌన్‌కు ముందు లంచ్ బాక్స్ తీసుకువెళ్లేవాన్ని కాదు. మార్కెటింగ్ వృత్తి కావడంతో టైం దొరికినప్పుడే తినడం అలవాటైంది. ఆ టైమ్‌కు ఏది దొరికితే అది తినడం తప్పలేదు. దీంతో చైనీస్ ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటుపడ్డాను. అమీర్‌పేట్‌లో నూడుల్స్, ఎగ్, చికెన్ ఫ్రైడ్ రైస్ తినడం అలవాటైంది. ఇప్పుడు మామూలు ఫుడ్ తినాలంటే రుచించట్లేదు. కరోనా గోల తగ్గగానే అక్కడికే వెళ్ళి లాగించేస్తా. ఎన్నిసార్లు తిన్నా అవి బోర్ కొట్టవు’
మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంటుంది: రాజశేఖర్, చెఫ్
రోడ్ల మీద దొరికే స్ట్రీట్ ఫుడ్‌లు టేస్టీగా ఉండడానికి ప్రత్యేకమైన సాల్ట్ వాడుతుంటారు. దీంతో ఈ ఫుడ్ తిన్నవాళ్లు ఆ సాల్ట్ ప్రభావం వల్ల మళ్లీ మళ్లీ తినాలనుకుంటుంటారు. లాక్‌డౌన్ వల్ల రోడ్ల మీద ఫుడ్ దొరికి చాలా రోజులు గడిచినందు వల్ల చాలామందికి వారి ఫేవరెట్ ఫుడ్‌పై క్రేవింగ్ (నోరూరడం) వస్తున్నట్లుంది. సాధారణంగా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అయినా టేస్ట్ వారిని అటువైపు డ్రైవ్ చేస్తుంది’ అని రాజశేఖర్ అనే చెఫ్ చెబుతున్నాడు.
షాప్ మూసి నెలరోజులైంది: సుబ్బు, సికింద్రాబాద్
‘సికింద్రాబాద్‌లో నేను చైనీస్ ఫుడ్ స్టాల్‌ను నడుపుతుంటాను. అది ఓపెన్ చేసి అప్పుడే నెల రోజులైంది. నా స్టాల్‌లో అయిదుగురు పనిచేస్తారు. వారికి రూ. 10 నుంచి 20 వేల దాకా జీతాలిస్తాను. కస్టమర్లతో రోజూ నా స్టాల్ కళకళలాడేది. నా స్టాల్ స్పెషల్ వంటలు ఎగ్, చికెన్ నూడుల్స్. వీటి కోసం ఎక్కడెక్కడి నుంచో కార్లేసుకొని వచ్చి మరీ తింటారు. కరోనా వైరస్ వచ్చి మొత్తం పాడు చేసింది. ఆదాయం లేదు. పనిచేసేటోళ్లకు కష్టంమీద ఒకనెల జీతం ఇచ్చాను. ఈ నెల ఏం చేయాలో అర్థం కావడంలేదు. కరోనా త్వరగా పోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’
Tags: telangana, lockdown, hyderabad street food, people, eating habits, vendors, employment