బిగ్ బ్రేకింగ్ : వరంగల్ జోన్‌లో భారీగా సీఐల బదిలీలు

దిశ, కాటారం : వరంగల్ జోన్‌ పరిధిలో పనిచేస్తున్న 10 మంది సర్కిల్ ఇన్ స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాల మేరకు ఖమ్మం త్రి టౌన్ సీఐగా పని చేస్తున్న సీహెచ్ శ్రీధర్‌ను, ఖమ్మం టూ టౌన్‌కు, ఉమెన్ స్టేషన్ సీఐ సర్వయ్యను త్రి టౌన్‌కు, ఖమ్మం సీపీకి అటాచ్డ్‌గా ఉన్న సీసీఎస్ 2 సీఐగా, కొత్తగూడెం డీసీఆర్బీ సీఐగా పనిచేస్తున్న రామయ్యను టాస్క్ ఫోర్స్‌కు, కొత్తగూడెం […]

Update: 2021-08-24 11:09 GMT

దిశ, కాటారం : వరంగల్ జోన్‌ పరిధిలో పనిచేస్తున్న 10 మంది సర్కిల్ ఇన్ స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాల మేరకు ఖమ్మం త్రి టౌన్ సీఐగా పని చేస్తున్న సీహెచ్ శ్రీధర్‌ను, ఖమ్మం టూ టౌన్‌కు, ఉమెన్ స్టేషన్ సీఐ సర్వయ్యను త్రి టౌన్‌కు, ఖమ్మం సీపీకి అటాచ్డ్‌గా ఉన్న సీసీఎస్ 2 సీఐగా, కొత్తగూడెం డీసీఆర్బీ సీఐగా పనిచేస్తున్న రామయ్యను టాస్క్ ఫోర్స్‌కు, కొత్తగూడెం ఎస్పీ అటాచ్డ్‌లో సీఐగా పని చేస్తున్న నర్సింహులును భూపాలపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్ 2 ఇన్స్పెక్టర్‌గా, ములుగు సీసీఎస్ సీఐ సంజీవరావును భూపాలపల్లి స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా, మహబూబాబాద్ టౌన్ సీఐగా అటాచ్డ్‌లో పనిచేస్తున్న వెంకటరత్నం, మహబూబాబాద్ రూరల్ అటాచ్డ్ సీఐ ఎస్ రవికుమార్‌లకు అక్కడే రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్‌లో వెకెన్సీ రిజర్వూలో ఉన్న పి.రంజిత్ రావును కాటారంనకు, కాటారం సీఐ హథీరాంను వరంగల్ డీఐజీకి అటాచ్డ్ చేస్తూ నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News