సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..
– లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కన్నన్ మృతి సినీపరిశ్రమకు 2020 కలిసి రావడం లేదు. వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్ దిగ్గజ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌ను కోల్పోయి సంఘటనల నుంచి తేరుకోక మునుపే కన్నడ హీరో చిరంజీవిని కోల్పోయింది ఇండస్ట్రీ. ఈ షాక్ నుంచి బయటకు వచ్చేలోపే భారతీయ సినీపరిశ్రమ మరో దిగ్గజ టెక్నీషియన్‌ను కోల్పోయింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి.కన్నన్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ లెజెండరీ సినిమాటోగ్రాఫర్.. చెన్నైలోని ఆస్పత్రిలో […]
– లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కన్నన్ మృతి
సినీపరిశ్రమకు 2020 కలిసి రావడం లేదు. వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్ దిగ్గజ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌ను కోల్పోయి సంఘటనల నుంచి తేరుకోక మునుపే కన్నడ హీరో చిరంజీవిని కోల్పోయింది ఇండస్ట్రీ. ఈ షాక్ నుంచి బయటకు వచ్చేలోపే భారతీయ సినీపరిశ్రమ మరో దిగ్గజ టెక్నీషియన్‌ను కోల్పోయింది.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి.కన్నన్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ లెజెండరీ సినిమాటోగ్రాఫర్.. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హార్ట్ సర్జరీ తర్వాత మరింత అనారోగ్యానికి గురైన కన్నన్.. 69 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ వార్తతో దిగ్భ్రాంతికి గురైన సౌత్ ఇండస్ట్రీ సినీప్రముఖులు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
ప్రముఖ దర్శకుడు భీమ్ సింగ్ తనయుడు, ఎడిటర్ బి. లెనిన్ సోదరుడైన కన్నన్.. తమిళ్, కన్నడ భాషల్లో 50 సినిమాలు చేశారు. కాగా వీటిలో 40 చిత్రాలు భారతీ రాజాతో చేయడం విశేషం. వీరిద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉండేదట.
చెన్నై వడపళనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నన్‌కు ఈ మధ్యే హార్ట్ సర్జరీ జరిగింది. కానీ అప్పటి నుంచి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడే ట్రీట్మెంట్ జరుగుతుండగానే తుది శ్వాస విడిచారు కన్నన్.
https://twitter.com/Dhananjayang/status/1271739044825686016?s=19