బంపర్ ఆఫర్ కొట్టేసిన ఏజెంట్ హీరోయిన్.. ఏకంగా పవన్ కల్యాణ్‌తోనే..!

ముంబైకి చెందిన యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2023-06-23 04:37 GMT
బంపర్ ఆఫర్ కొట్టేసిన ఏజెంట్ హీరోయిన్.. ఏకంగా పవన్ కల్యాణ్‌తోనే..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ముంబైకి చెందిన యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి మాత్రం టాలీవుడ్‌లో ఆఫర్లు బాగానే వస్తునట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాక్షి బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ బ్యూటీకి ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్ వచ్చిందట. పవన్ కల్యాణ్ హీరోగా, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో ఇప్పటికే శ్రీలీల నటిస్తుండగా.. మరో మెయిన్ రోల్‌కు సాక్షి వైద్యను సంప్రదించారట మూవీ మేకర్స్. ఈ ప్రపోజల్‌కి సాక్షి సైతం ఎస్ చెప్పినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజం అయితే.. ఈ బ్యూటీ కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో.

Read More...   Ram Charan's daughter.. చరణ్ని ఆ రేంజుకు తీసుకెళ్లనుందట?

నెటిజన్ ప్రశ్నకు దీటైన సమాధానం ఇచ్చిన శృతి హాసన్.. ఇంతకి ఏంటది..? 

Tags:    

Similar News