Lavanya: ఈసారి నీకు మూడిందంటూ మరోసారి వార్తల్లోకి లావణ్య.. సంచలనంగా మారిన రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి పోస్ట్

గతేడాది టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Industry)లో హాట్ టాపిక్‌గా మారిన విషయాల్లో హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ఇష్యూ ఒకటి.

Update: 2025-01-12 15:54 GMT
Lavanya: ఈసారి నీకు మూడిందంటూ మరోసారి వార్తల్లోకి లావణ్య.. సంచలనంగా మారిన రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి పోస్ట్
  • whatsapp icon

దిశ, సినిమా: గతేడాది టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Industry)లో హాట్ టాపిక్‌గా మారిన విషయాల్లో హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ఇష్యూ ఒకటి. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసంచేశాడని, పదకొండేళ్లు తనతో సహజీవనం చేసి వాడుకొని వదిలేసాడంటూ లావణ్య (Lavanya) అనే యువతి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్‌తో ప్రజెంట్ రిలేషన్‌లో ఉన్నాడంటూ కేసు పెట్టింది. ఈ ఇష్యూ రాజ్ తరుణ్ సినిమాలు రిలీజ్‌కు ముందు సంచలనంగా మారాయి. వివాదం నెలకొన్న టైములోనే రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra)తో కలిసి నటించిన ‘తిరగబడరసామీ’తో పాటు ‘పురుషోత్తముడు’, ‘భలే ఉన్నాడే’ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఈ కాంట్రవర్సీ (Controversy) కారణంగా కొంత వరకు పబ్లిసిటీ వచ్చినప్పటికీ.. ఈ చిత్రాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. అయితే.. ఈ సినిమాల రిలీజ్ అనంతరం ఏమైందో తెలియదు కానీ సడెన్‌గా సైలెంట్ అయింది. సినిమా ప్రమోషన్స్ కోసమే ఇదంతా చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. ఏదైతేనే.. ఇక అంతా అయిపోయింది అనుకున్న క్రమంలో లావణ్య మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా సెకండ్ ఇన్నింగ్స్‌తో మళ్లీ వస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా లావణ్య ఓ పోస్ట్ పెట్టింది. అంతే కాకుండా.. ఈసారి మస్తాన్ సాయికి మూడిందని, అతని వ్యవహారాలన్నీ బయటపెడతానని చెప్పుకొచ్చింది. ఇది లైంగిక వేధింపులు, డ్రగ్స్ అలాగే మనీకి సంబంధించిన స్టోరీ అని చెప్పింది. సోమవారం ఉదయానికి మస్తాన్ సాయి మొదటి వీడియోతోనే పని మొదలు పెడతానని పేర్కొంది. ప్రజెంట్ ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది.

Tags:    

Similar News