ఆ హీరోల సినిమాలను ఈ సారైనా హిట్ వరించనుందా..?

వాళ్లు నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావాలని ఎంతో మంది టాలివుడ్ హీరోలు వేచిచూస్తున్నారు.

Update: 2024-10-12 10:54 GMT

దిశ, వె‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : వాళ్లు నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావాలని ఎంతో మంది టాలివుడ్ హీరోలు వేచిచూస్తున్నారు. అలాంటి హీరోలకు తెలుగు ఇండస్ట్రీలో కొదువే లేదు. ఏండ్ల నుంచి ఒక్క సినిమా కూడా హిట్ కాని హీరోలు ఈ సారనైన హిట్ జాబితాలోకి ఎక్కుతారో లేదో అంటూ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గోపీచంద్‌ నుంచి మంచు విష్ణు వరకు చాలామంది హీరోలు ఎలాగైనా 2024లో ఒక్క సినిమా అయినా హిట్‌ చేసుకోవాలని తహతహలాడుతున్నారు. మరి వాళ్లు అనుకున్న విజయం ఈ ఏడాది అయినా వస్తుందో మరి లేదో వేచి చూడాల్సిందే. ఇక ఆ జాబితాలో ఉన్న కొంతమంది గురించి తెలుసుకుందాం.

ఎన్నో రోజుల నుంచి ఓ మంచి హిట్‌ కొట్టాలని ఎదురు చూస్తున్న శ్రీనువైట్ల ఇటీవలే విశ్వం చిత్రంని విడుదల చేశారు. ఈ సినిమా పై గోపీచంద్‌ అటు దర్శకులకు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. అనుకున్నట్టుగా ఈ చిత్రం వారికి కాస్త ఊరటను కలిగించేలా కనిపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టి.జి.విశ్వప్రసాద్‌, చిత్రాలయం స్టూడియోస్‌ వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా బరిలోకి అడుగుపెట్టింది.

ఇక నితిన్ విషయానికి వస్తే రాబిన్ హుడ్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌ 20 కోసం రెడీ అవుతోంది. ఒక వేళ గేమ్‌ చేంజర్‌ కూడా అదే రోజు బరిలోకి అడుగుపెడితే రాబిన్‌‎హుడ్‌ ని విడుదల చేస్తారా ? లేదా ? అనేది అందరిలో ఉన్న వెయ్యి డాలర్ల ప్రశ్న. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు నితిన్.

ఇక అదే రోజున నాగచైతన్య కూడా తండేల్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కస్టడీ మూవీ తర్వాత పర్ఫెక్ట్ చిత్రం కోసం నాగచైతన్య వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమా కూడా నాగ చైతన్యకి బ్లాక్ బస్టర్ అందించేలా కనిపిస్తుంది.

ఇప్పటికే తండేల్ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. కార్తికేయ 2తో చిత్రంతో పాన్ ఇండియా హిట్ ను చేజిక్కించుకున్న చందు మొండేటి ఈ సినిమాకి దర్శకుడు కావడంతో పై భారీ అంచనాలు ఉన్నాయి.

మరో వైపు కన్నప్పని కూడా ఈ సంవత్సరంలోనే విడుదల చేస్తామని మంచు విష్ణు అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో క్రేజీ స్టార్లు అందరినీ ఆకట్టుకోనున్నారు.  

Tags:    

Similar News