Pushpa-2:‘పుష్ప-2’ మూవీకి బిగ్ షాక్.. అక్కడ షోలు నిలిపివేత?

ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2 ది రూల్’ (Pushpa-2 The Rule) మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

Update: 2024-12-20 09:18 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2 ది రూల్’ (Pushpa-2 The Rule) మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. భారీ అంచనాలతో డిసెంబర్ 5వ తేదీన విడుదలైన పుష్ప–2 మూవీ(Pushpa-2 Movie) టాలీవుడ్‌(Tollywood)లోనే కాకుండా బాలివుడ్‌లో(Bollywood) కూడా భారీ కలెక్షన్లతో(Huge Collections) దూసుకెళ్తోంది. అంతేకాదు ఈ మూవీని సౌత్ టు నార్త్ వరకు రిపీటెడ్‌గా చూస్తున్నరంట. దీంతో రోజుకో రికార్డు బ్రేక్ చేస్తూ చరిత్ర సృష్టిస్తోంది.

ఈ క్రమంలో పుష్ప-2 మూవీకి బిగ్ షాక్ తగిలినట్లు సమాచారం. హిందీ బాక్సాఫీస్‌ను(Hindi box office) షేక్ చేస్తోన్న పుష్ప-2కు PVR INOX షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నార్త్ ఇండియాలో షోలను రద్దు చేసేందుకు PVR సిద్ధమైనట్లు సమాచారం. ‘బేబీ జాన్’ ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో 50-50 షోస్‌ను పుష్ప-2 డిస్ట్రిబ్యూటర్ కోరడంతో థియేటర్ల పంపిణీ గొడవ తలెత్తింది. మేకర్స్ దీనిపై చర్చలు జరపడంతో ఉదయం నుంచి కొన్ని చోట్ల షోలు తిరిగి స్టార్ట్ అయ్యాయి. దీంతో ఈ నెల(డిసెంబర్) 25 తర్వాత షోలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

Tags:    

Similar News