బుల్లి తెరపై టీఆర్పీ రేటింగ్‌తో దుమ్ము దులిపిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. పోస్ట్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankrantiki Vasthunnam).

Update: 2025-03-14 07:45 GMT
బుల్లి తెరపై టీఆర్పీ రేటింగ్‌తో దుమ్ము దులిపిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. పోస్ట్ వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankrantiki Vasthunnam). ఈ మూవీలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న రిలీజ్ అయ్యింది. ఇక ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కడంతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కళ్లు చెదిరే వసూళ్లతో ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఇక ఇటీవల ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రీమియర్‌లో కూడా వచ్చేసింది. జీ తెలుగు(Zee Telugu) ఛానెల్‌లో మార్చి 1న ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అయ్యింది. అయితే, ఈ సినిమాకు టెలివిజన్ ప్రీమియర్‌లో ఏకంగా 18.1 టీవీఆర్(టెలివిజన్ వ్యూయర్ రేటింగ్) దక్కినట్లు తెలుస్తోంది. SD ఛానెల్‌+HD ఛానెల్‌లో కలిపి ఈ రేటింగ్ దక్కినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. గత రెండేళ్లలో ఈ చిత్రం హయ్యెస్ట్ టీవీఆర్ సాధించిందని చిత్ర యూనిట్ తెలిపింది.

అదే రోజున ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు కూడా రావడం విశేషం. అయినా కూడా టీవీలో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు. గత ఐదేళ్లలో జీ తెలుగులో టెలికాస్ట్ అయిన చిత్రాల్లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) మూవీ టాప్ ప్లేస్‌లో ఉండగా.. సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు రెండో ప్లేస్‌కు చేరుకుంది. ఇలా థియేటర్స్, ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం.. ఇప్పుడు బుల్లితెరపై కూడా రికార్డులను సృష్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read Also.. మీరు వర్జినా అని డైరెక్ట్‌గా అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ప్రభాస్ బ్యూటీ(ట్వీట్) 

Tags:    

Similar News

Shivangi Verma