OTT Release : వేట్టయన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం
దిశ,వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయన్’ అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజైంది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా అనిరుద్ సంగీతం అందించాడు. టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన వేట్టయన్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగులో అయితే ఈ చిత్రానికి నిరాశ ఎదురైంది. కాగా మూవీ ఓటీటీ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ (OTT platform) అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబర్ 8 నుంచి ఇది స్ట్రీమింగ్ (streaming) కానుందని ఓటీటీ సంస్థ ప్రకటించింది. పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది.