ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన వెంకటేష్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎన్ని కోట్లు రాబట్టిందంటే? (ట్వీట్)

విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam).

Update: 2025-01-27 10:01 GMT
ప్రభాస్ రికార్డ్  బ్రేక్ చేసిన వెంకటేష్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎన్ని కోట్లు రాబట్టిందంటే? (ట్వీట్)
  • whatsapp icon

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై దీనిని దిల్ రాజు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించగా.. నరేష్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది.

అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమా విడుదల 13వ రోజు రూ. 6.77 కోట్ల షేర్ వసూళ్లను సాధించి ప్రభాస్ నటించిన ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. అయితే చిత్రం ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా రూ.260 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News

Monami Ghosh